బిహార్ ఎన్నికలను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:45 PM
ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకొని కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎ్‌సఎస్ అజెండాతో అమలు చేసిన బిహార్ ఎన్నికలను రద్దుచేయాలని రిజర్వేషన పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోతుల నాగరాజు డిమాండ్ చేశారు.
ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోతుల నాగరాజు
నంద్యాల హాస్పిటల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకొని కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎ్‌సఎస్ అజెండాతో అమలు చేసిన బిహార్ ఎన్నికలను రద్దుచేయాలని రిజర్వేషన పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బహుజనులను రాజకీయంగా అంతంచేసే కుట్ర జరుగుతోందని, మనువాదుల కుట్రలు, కుతంత్రాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బహుజన నాయకుల చేతిలో ఉన్న బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే లాంటి పార్టీలకు అధికారం దక్కకుండా కుట్రలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలనే దళారులుగా వాడుకొని బహుజన రాజకీయ పార్టీలను అంతం చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో ఆర్‌ఈఎఫ్ జాతీయ నాయకులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుగు శివకృష్ణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు బిజినవేముల శ్రీనివాసులు, డోన ఆర్పీఎస్ నాయకులు సుబ్బుయాదవ్, హుసేన, వెంకటేష్, ఆదినారాయణ, బజారి పాల్గొన్నారు.