నిధులు పక్కదారి పట్టించారు: భూమిరెడ్డి
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:50 AM
రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసం కేంద్రం రూ.700 కోట్లు ఇస్తే జగన్ ఆ మొత్తం నిధులనూ దారి మళ్లించారని ఎమ్మెల్సీ...
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసం కేంద్రం రూ.700 కోట్లు ఇస్తే జగన్ ఆ మొత్తం నిధులనూ దారి మళ్లించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,500 కోట్లు అవసరం అయితే జగన్ పాలనలో కేవలం రూ.1,451 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఈ మొత్తంలో కేంద్రం ఇచ్చింది రూ.975 కోట్లు కాగా జగన్ ఖర్చు చేసింది కేవలం రూ.476 కోట్లు మాత్రమేనని వివరించారు.