TTD Cow Deaths: నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: భూమన
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:13 AM
టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయినట్టే న Persistently ఆరోపిస్తూ, తాను చూపిన ఫొటోలు మార్ఫింగ్ కాదని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణకైనా, గోశాల పరిశీలనకైనా తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు.

తిరుపతి(రవాణా), ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలలో గోవులు చనిపోయాయని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయిన ఆవుల సంఖ్యపై టీటీడీ చైర్మన్, ఈవో తదితరులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. చనిపోయిన గోవులకు సంబంధించిన తాను చూపిన ఫొటోలను మార్ఫింగ్ అని టీటీడీ ప్రకటన చేసిందని, టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. అయితే ఆ ఫొటోలు మార్ఫింగ్ కాదని, అవి టీటీడీ గోశాలలో తీసినవేనని, భగవంతుడిపై ప్ర మాణం చేస్తున్నానని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమన్నారు. గోశాలకు సాఽధువులు, స్వామీజీలతో కలిసి వెళ్లి.. ఎన్ని గోవులు చనిపోయాయో చూద్దామని, రావడానికి తానూ సిద్ధమన్నారు. టీటీడీని ప్రక్షాళన చేశానని చెప్పుకుంటున్నారని, ఎక్కడ ప్రక్షాళన చేశారో అర్థం కావడం లేదన్నారు. టీటీడీ ఉద్యోగుల్లో 2 వేల మంది త మ నిఘా నేత్రాలేనని, వారు టీటీడీలో జరుగుతున్న విషయాలపై తమకు సమాచారం ఇస్తుంటారని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..