Share News

Illegal Activities: అక్కడా.. అదే నీచం..

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:41 AM

మహిళలంటే కనీసం గౌరవం లేకుండా, అడ్డగోలు పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మాలపాటి భాస్కర్‌రెడ్డికి చెత్త చరిత్ర ఉంది.

Illegal Activities: అక్కడా.. అదే నీచం..

  • బ్రిటన్‌లోనూ భాస్కర్‌రెడ్డి ‘చెత్త’ పనులు

  • ఆయన షాపులో మైనర్లకు ఎలాట్రానిక్ సిగరెట్ల విక్రయం

  • నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు

  • భారీ జరిమానా విధించిన అక్కడి కోర్టు

  • బీబీసీ సహా అంతర్జాయ మీడియాలో కథనాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహిళలంటే కనీసం గౌరవం లేకుండా, అడ్డగోలు పోస్టుల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మాలపాటి భాస్కర్‌రెడ్డికి చెత్త చరిత్ర ఉంది! లండన్‌లో ఉంటూ ఏపీలోని మహిళలు, గిట్టని రాజకీయ పార్టీల నేతలపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే ఆయన.. అక్కడ కూడా చట్టవిరుద్ధ పనులు చేస్తున్నట్లు తేలింది. బీబీసీ, ట్రేడింగ్‌ స్టాండర్డ్స్‌ వంటి అంతర్జాతీయ మీడియాలోనూ ఆయన పనులపై కథనాలు వచ్చాయి. లండన్‌లోని టాన్‌టన్‌లో భాస్కర్‌రెడ్డి ‘రెడ్డీ న్యూస్‌’ పేరిట ఒక దుకాణం నడుపుతున్నాడు. ఆ షాపులో అక్కడి నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లు విక్రయించారు. దీనిపై కేసు నమోదు కావడంతో పాటు భారీగా జరిమానా కూడా విధించారు. భాస్కర్‌రెడ్డి షాపులో సకలం అమ్ముతారు. అయితే బ్రిటన్‌లో ఏ వస్తువు ఎవరికి విక్రయించాలి? 18 ఏళ్ల లోపు వారికి ఏ వస్తువులు అమ్మకూడదు? అనే దానిపై నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. వాటిని అక్కడి షాపుల నిర్వాహకులు కచ్చితంగా అమలు చేయాలి. నిబంధనల ఉల్లంఘన జరిగితే కోర్టు కేసులు, భారీ జరిమానాలు, ఇంకా అరెస్టులు కూడా ఉంటాయి. బ్రిటన్‌లోని ది చిల్డ్రన్‌ అండ్‌ ప్యామిలీస్‌ యాక్ట్‌-2014 ప్రకారం పిల్లలకు సిగరెట్లు అమ్మకూడదు. అలాంటిది భాస్కర్‌రె డ్డి షాపులో చిన్నారులకు ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లు విక్రయించడాన్ని స్వయంగా అక్కడి ట్రేడ్‌ ప్రమాణాల అధికారులు గుర్తించారు. చిన్న పిల్లలకు సిగరెట్లు ఎందుకు అమ్మారని షాపులో విక్రయించిన వ్యక్తిని నిలదీయగా.. తాను ఇక్కడి ఉద్యోగిని కాదని, కేవలం సహాయం చేశానని తప్పించుకో చూశారు. కానీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. అతడు సహాయకుడు కాదని, ఆ షాపులో పనిచేసే ఉద్యోగి అని గుర్తించారు. గతేడాది అక్టోబరులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో షాపు యజమాని భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆయన ఓ పట్టాన సరైన సమాధానాలు చెప్పలేదు.


ఇక అక్కడి పద్ధతిలో విచారిస్తే అన్ని విషయాలు చెప్పారట! తన షాపులో పనిచేసే సిబ్బందికి ట్రేడింగ్‌ ప్రమాణాలపై శిక్షణ ఇవ్వలేదని, అందుకే మైనర్లకు ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లు విక్రయించినట్లు అంగీకరించాడు. దీంతో అక్కడి కోర్టు ఆయనకు 2,326 బ్రిటన్‌ పౌండ్ల (దాదాపు రూ.2.70 లక్షల పైనే) జరిమానా విధించింది. లండన్‌లో చట్టవిరుద్ధ పనులకు పాల్పడే భాస్కర్‌రెడ్డి.. వీపీఎన్‌ టెక్నాలజీతో ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఏపీలోని మహిళలు, నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతుంటారు. గూగుల్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఇతర వెబ్‌ బ్రౌజర్లలో మాలపాటి భాస్కర్‌రెడ్డి పేరుపై శోధిస్తే చాలు.. టాన్‌టన్‌లో ఆయన వ్యవహారంపై వార్తలు వస్తున్నాయి.

Updated Date - Nov 08 , 2025 | 06:43 AM