యువతకు రాజకీయ వేదిక బీజేవైఎం: మాధవ్
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:18 AM
రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేయాలనుకునే యువతకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) సరైన వేదికని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేయాలనుకునే యువతకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) సరైన వేదికని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచించారు. విజయవాడ బీజేవైఎం సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో జాతీయ భావజాలం ఉన్న యువత రాజకీయ ఆకాంక్షలకు బీజేవైఎం నిచ్చెన కావాలి. బీజేవైఎం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలి. మోదీ నాయకత్వలో దేశం బలోపేతమైన తీరు, ఎన్డీఏ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి. మరో వైపు స్థానిక సమస్యలపైనా బీజేవైఎం స్పందించాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలి’ అని సూచించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.