Share News

Deputy CM Pawan: ఈ మారీచులతో జాగ్రత్త

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:14 AM

దీపకాంతులతో శోభాయమానంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండుగ దీపావళి అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Deputy CM Pawan: ఈ మారీచులతో జాగ్రత్త

  • ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలసి ఓడించారు

  • ఆ అక్కసుతో ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్రలు

  • ఈ నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి

  • ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి

  • ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపు

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దీపకాంతులతో శోభాయమానంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండుగ దీపావళి అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తెలు గు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన దేశంలో ప్రతి పండుగకూ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ, తమను ఓడించారనే అక్కసుతో, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతిని రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. వీరిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి’ అని ఆదివారం ఓ ప్రకటనలో పవన్‌ పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆకాంక్షించారు. ఆరోగ్యం కంటే గొప్ప సంపద లేదని, ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 04:15 AM