మెరుగైన విద్యను అందించాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:56 PM
గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన సభ్యుడు వెంకటప్ప ఆదేశించారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన సభ్యుడు వెంకటప్ప
బలపనూరు గిరిజన కళాశాల పరిశీలన
పాణ్యం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన సభ్యుడు వెంకటప్ప ఆదేశించారు. సోమవారం బలపనూరు గిరిజన గురుకుల కళాశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన సభ్యుడు పరిశీలించారు. విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు, గృహసదుపాయాలు, భోజనవసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించడంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో పీవో శివప్రసాద్, ఏటీడబ్ల్యూవో హుశేనయ్య, గురుకుల ప్రధాన కార్యాలయ సిబ్బంది రామమోహనరెడి,్డ ప్రిన్సిపాల్ అరుణకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏఎనఎంలకు శిక్షణ
గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచవో రవి ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గురుకుల పాఠశాలల ఏఎనఎంలకు బలపనూరు గిరిజన గురుకుల పాఠశాలో శిక్షణనిచ్చారు. విద్యార్థినుల ఆరో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర జాగ్రత్తలపై వైద్యురాలు అనిత శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో పీవో వెంకటశివప్రసాద్, ప్రిన్సిపాల్ మేరీసలోమి పాల్గొన్నారు.