Share News

నిమ్మలూరులో బెల్‌ కంపెనీ ప్రారంభం

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:57 AM

జిల్లాలోని నిమ్మలూరులో నూతనంగా నిర్మించిన బెల్‌ కంపెనీని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు.

నిమ్మలూరులో బెల్‌ కంపెనీ ప్రారంభం

మచిలీపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని నిమ్మలూరులో నూతనంగా నిర్మించిన బెల్‌ కంపెనీని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. నిమ్మలూరు గ్రామం వద్ద రూ.362 కోట్ల వ్యయంతో బెల్‌ కంపెనీని గతంలో నిర్మాణం చేశారు. కర్నూలు జిల్లా నన్నూరు వద్ద సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన జిల్లాలోని నిమ్మలూరు బెల్‌ కంపెనీలో అడ్వాన్స్‌డ్‌ నైట్‌విజన్‌ ప్రొడక్ట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రత్యర్థి దేశం ప్రయోగించిన డ్రోన్‌లను ఇక్కడ తయారు చేసిన పరికరాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని తెలిపారు. దీంతో మన దేశరక్షణ వ్యవస్థ ఎంత పటిష్టవంతంగా ఉందో ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని వివరించారు.

Updated Date - Oct 17 , 2025 | 12:58 AM