BC Welfare Association: స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు బీసీ సంక్షేమ సంఘం
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:24 AM
రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు....
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. బీసీ జనగణన, వర్గీకరణ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, దీనిని రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది.