Share News

లక్ష్మీదేవికి బీసీ రాజారెడ్డి సహకారం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:20 PM

వింత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీదేవికి ప్రతినెలా తాను పింఛన అందజేస్తానని బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి వెల్లడించారు.

లక్ష్మీదేవికి బీసీ రాజారెడ్డి సహకారం
లక్ష్మీదేవికి తన సొంత నిధులతో పింఛను డబ్బులు అందిస్తున్న బీసీ రాజారెడ్డి

కోవెలకుంట్ల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వింత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీదేవికి ప్రతినెలా తాను పింఛన అందజేస్తానని బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి వెల్లడించారు. ఈ నెల 22న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కూతురుకి అన్నీ తానై..’ కథనానికి బీసీ రాజారెడ్డి స్పందించారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని తన కార్యాలయం వద్ద లక్ష్మీదేవికి రూ.500 పింఛన అందజేశారు. తన సొంత నిధులతో జీవితాంతం ప్రతినెలా పింఛన అందజేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో హౌస్‌హోల్డ్‌ మ్యాప్‌ సర్వే ద్వారా ఉన్న వస్తున్న పింఛను రద్దయిన విషయం తెలుసుకుని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కొత్త పింఛను వచ్చేలా చర్య లు చేపడతానన్నారు. తన తండ్రి బీసీ గుర్విరెడ్డి జ్ఞాపకార్ధం అంధులకు, మానసిక వికలాంగులకు మంచానికే పరిమితమైనవారికి సుమారు 165 మందికి 16 సంవత్సరాల నుంచి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున సొంత నిధులతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే లక్ష్మిదేవికి కూడా పింఛను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో ఆయనకు లక్ష్మీదేవి కుటుబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:20 PM