BC Communities: జగన్‌పై బీసీల భగ్గు
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:54 AM
బడుగు, బలహీనవర్గాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులను అవహేళన చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులను అవహేళన చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య, సీనియర్ ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టిని వాడు.. వీడు అంటూ తక్కువ చేసి మాట్లాడటంపై భగ్గుమన్నాయి. పలుజిల్లాల్లో ర్యాలీలు నిర్వహించడంతోపాటు జగన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కర్నూలు, ప్రకాశం, అనంతపురం, గోదావరి జిల్లాల్లో యాదవ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. నెల్లూరు, విజయవాడలో బీసీలు నిరసన ర్యాలీలు చేశారు. గుంటూరులో శనివారం భారీ నిరసనకు యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. జగన్ వ్యాఖ్యలను బీసీ సంక్షేమ సంఘం జేఏసీ ఖండించింది. జగన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పోరా టం తీవ్రం చేస్తామని బీసీ నేతలు హెచ్చరించారు.