Share News

పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి: సవిత

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:09 AM

సీఎంచంద్రబాబు ప్రతిష్ఠాత్మకం గా అమలు చేస్తున్న పీ4 మోడల్‌లో రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.

పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి: సవిత

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): సీఎంచంద్రబాబు ప్రతిష్ఠాత్మకం గా అమలు చేస్తున్న పీ4 మోడల్‌లో రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు దాతలు, ఎన్టీఆర్‌ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థుల సాయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. 2016-19 మధ్య కాలంలో ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం కింద లబ్ధి పొందిన ఎందరో విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉండటం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆర్థికంగా ఉన్నతస్థానాల్లో ఉన్న వారు వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సాయమందించడానికి ముందుకు రావాలని కోరారు.

Updated Date - Jul 26 , 2025 | 04:09 AM