PVN Madhav: బీజేపీతోనే బీసీల ప్రగతి
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:51 AM
వెనుకబడిన వర్గాలుగా పేర్కొంటున్న వారిని వెన్నెముకగా గౌరవిస్తోన్న బీజేపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
కూటమి పెద్దలతో మాట్లాడి సమస్యలు పరిష్కారం
ఓబీసీ మోర్చా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలుగా పేర్కొంటున్న వారిని వెన్నెముకగా గౌరవిస్తోన్న బీజేపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశానికి మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని బీసీల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మాధవ్ మాట్లాడుతూ... భారత దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని మండిపడ్డారు. బ్యాలెట్ బాక్స్ వద్దే బీసీలను ఇతర పార్టీలు ఆపేస్తే బీజేపీ నాయకుల్ని చేసి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లోని కుల వృత్తుల బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాటిచ్చారు. బీసీల్లో ఇప్పటికీ అనేక కులాలు వివక్షకు గురవుతున్నాయని, ఓబీసీ మోర్చా ద్వారా బీసీలను సంఘటితం చేస్తామని మాధవ్ అన్నారు.