Bank Foundation Ceremony: అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన వాయిదా
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:42 AM
రాజధాని అమరావతిలో ఈ నెల 28వ తేదీన జరగాల్సిన బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం మొంథా తుఫాన్ కారణంగా వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా....
ఇంటర్నెట్ డెస్క్: రాజధాని అమరావతిలో ఈ నెల 28వ తేదీన జరగాల్సిన బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం మొంథా తుఫాన్ కారణంగా వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అమరావతిలో ఒకేసారి 12 జాతీయ బ్యాంకుల రాష్ట్రస్థాయి ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని మొదట నిర్ణయించారు. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. 2014-19 మధ్యకాలంలోనే అమరావతిలో ఉద్దండరాయునిపాలెం వద్ద 12 జాతీయ బ్యాంకుల కోసం స్థలాలు కేటాయించారు. భూముల చదును కూడా పూర్తయింది. కానీ 2019లో జగన్ అధికారంలోకి రావడంతో బ్యాంకులు ఆ స్థలాలు స్వాధీనం చేసుకోవడానికి ముందుకురాలేదు. రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఎస్‌బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. ఆ స్థలంలో ఎస్‌బీఐ 14 అంతస్థుల భవనం నిర్మించనుంది. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్యాలయాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చాయి.