Share News

అట్టహాసంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:45 AM

మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్‌ హాలులో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. మూడు స్తంభాల సెంటర్‌ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

 అట్టహాసంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

- రైతులకు అండదండగా కూటమి ప్రభుత్వం

- మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):

మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్‌ హాలులో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా బండి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. మూడు స్తంభాల సెంటర్‌ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతులకు అండదండలుగా ఉండేలా కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీని నూతన అధ్యక్షుడు బండి రామకృష్ణ తీర్చిదిద్దుతారని తెలిపారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, తన గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఒక హోటల్‌ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన రామకృష్ణ హోటల్‌, విద్య, రాజకీయ రంగంలో రాణించారన్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్‌, యార్లగడ్డ వెంకట్రావు, జనసేన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్‌ మట్టా ప్రసాద్‌, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కుంచే నాని, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, తలారి సోమశేఖర్‌, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:45 AM