Share News

బండలాగుడు పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:54 PM

మండలంలోని కాల్వ గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పాలబండ ఎద్దులబండ లాగుడు పోటీలను ఆదివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, రాష్ట్ర మంత్రి ఎనఎండీ ఫరూక్‌ తనయుడు ఎనఎండీ ఫీరోజ్‌ ప్రారంభించారు.

 బండలాగుడు పోటీలు  ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాల్వ గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పాలబండ ఎద్దులబండ లాగుడు పోటీలను ఆదివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, రాష్ట్ర మంత్రి ఎనఎండీ ఫరూక్‌ తనయుడు ఎనఎండీ ఫీరోజ్‌ ప్రారంభించారు. మొదటి విజేతగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం వెంకటకృష్ణయ్య ఎద్దులు 4,235 అడుగుల దూరం లాగి రూ.70వేలను కైవసం చేసుకున్నాయి. రెండో విజేతగా తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షర రెడ్డి ఎద్దులు 4103 అడుగుల దూరం లాగి రూ.50వేల నగదును గెలుపొందాయి. మూడో విజేతగా నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి నారాయణ రెడ్డి ఎద్దులు 3895 అడుగుల దూరం లాగి రూ.40వేల నగదును గెలుపొందాయి. విజేతలకు దాతలు మాసూం, వలి, హుశేనషా, టీడీపీ నాయకులు రజాక్‌, సామన్నగారి రామచంద్రుడు, మహ్మద్‌ హుశేన, రసూల్‌, అబ్దుల్‌ రవూఫ్‌, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో రజాక్‌, కొట్టమిద్దె వలి, హుశేన, మాసూం, అబ్గజ్‌ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:54 PM