రైతులను ఉత్తేజ పరిచేందుకే బండలాగుడు పోటీలు
ABN , Publish Date - May 04 , 2025 | 11:35 PM
రైతులను ఉత్తేజ పరిచేందుకే దాతల సహకారంతో బండలాగుడు పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని టీడీపీ సీనియర్ నాయకుడు, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
ఓర్వకల్లు, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతులను ఉత్తేజ పరిచేందుకే దాతల సహకారంతో బండలాగుడు పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని టీడీపీ సీనియర్ నాయకుడు, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో శ్రీదేవి సహిత భూదేవి సమేత లక్ష్మి వెంకటేశ్వరస్వామి తిరుణాల సందర్బంగా నిర్వహించిన తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పాలపండ్ల బండలాగుడు పోటీలను గౌరు వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పోటీలకు రెండు రాష్ట్రాల నుంచి 12 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. వీటిని తిలకించేందుకు రైతులు భారీగా తరలివచ్చి కేరింతలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. మొదటి విజేతగా అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన కోనేపల్లి ఇంద్రారెడ్డి ఎద్దులు రూ.50వేలు, రెండో విజేతగా కర్నూలు జిల్లా రేమట గ్రామానికి చెందిన రైతు చిన్నగిడ్డయ్య నాయుడు ఎద్దులు రూ.40వేలు, మూడో విజేతగా తెలంగాణ రాష్ట్రం కొత్తకోట మండలం మల్యాల గ్రామానికి చెందిన డా.గురునాథ్, మైమున్నా ఎద్దులు, రూ.30వేలు, నాలుగో విజేతగా పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎద్దులు రూ.20వేలు నగదును గెలుచుకున్నాయి. గెలుపొందిన రైతులకు దాతలు నగదును అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాద్యక్షుడు మోహన రెడ్డి, ధర్మకర్తలు పల్లె నాగేశ్వరరెడ్డి, సుధాకర్, రమణారెడ్డి, విజయుడు, భరత, నాగేశ్వరరెడ్డి, రైతులు పాల్గొన్నారు.