విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను నిషేధిస్తే బాగుండేది: లావు
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:16 AM
కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా సమావేశాల సమయం వృథా కాకుండా చేయగలిగామని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా సమావేశాల సమయం వృథా కాకుండా చేయగలిగామని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. అయితే విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను కూడా నిషేధించి ఉంటే బాగుండేదని ఆయన అన్నప్పుడు, ఆ విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటామని మోదీ అన్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో పాటు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.