Share News

Perni Nani: అఖండ కోసం జగన్‌ను కలుస్తానన్న బాలకృష్ణ

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:41 AM

అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాతో మాట్లాడారు. సీఎం జగన్‌ను కలుస్తానని చెప్పారు. ఈ విషయాన్ని నాటి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా..

Perni Nani: అఖండ కోసం జగన్‌ను కలుస్తానన్న బాలకృష్ణ

వాళ్లకేం కావాలో చేయాలని నాటి సీఎం చెప్పారు: పేర్ని నాని

బాలకృష్ణకు పిచ్చి అని దగ్గుబాటి పుస్తకంలో రాశారు: భూమన

మచిలీపట్నం/తిరుపతి(జీవకోన), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాతో మాట్లాడారు. సీఎం జగన్‌ను కలుస్తానని చెప్పారు. ఈ విషయాన్ని నాటి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లకు ఏం కావాలో చేసి పెట్టమని చెప్పారు. నా తల్లిదండ్రులపై ఒట్టేసి ఈ మాట చెబుతున్నా’ అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కు చంద్రబాబు.. ఇస్తున్న గౌరవాన్ని చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. చిరంజీవి, పవన్‌ అంటే బాలకృష్ణకు పడదని, ఆ ఉక్రోషంతోనే చిరంజీవిపై బాలకృష్ణ అసెంబ్లీలో విరుచుకుపడ్డారన్నారు. ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారన్నారు. మాజీ సీఎం జగన్‌ను సైకో అంటున్న బాలకృష్ణే నిజమైన సైకో అన్నారు. బాలకృష్ణకు 20 ఏళ్ల ముందే పిచ్చి పట్టిందన్న విషయాన్ని వాళ్ల బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఏది నిజం’ అనే పుస్తకంలో రాశారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ... వైఎస్‌ దయ వల్లే కాల్పుల కేసు నుంచి బాలకృష్ణ విముక్తుడయ్యారని చెప్పారు.

Updated Date - Sep 27 , 2025 | 04:41 AM