బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:24 PM
ప్రజలందరూ కలిసి మెలిసి శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు.
నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలి
ఎస్పీ విక్రాంత పాటిల్
కర్నూలు క్రైం, జూన 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరూ కలిసి మెలిసి శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నగరంలోని వివిధ మతాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నిబంధనల మేరకు పోలీసులకు సహకరించాలని అన్నారు. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా కొనసాగుతున్నదని అన్నారు. ఏమైనా సమస్యలుంటే డయల్ 100కిగాని, స్థానిక పోలీసులకు గాని తెలియజేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన హుశేనపీరా, ఇనచార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, మత పెద్దలు ఖాజీ మౌలానా షేక్ అబ్దుల్ సలాం, మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్ రషీద్, సందడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.