Bairavakundam Reservoir: సీమలో బైరవగుండాల అందాలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:21 AM
కరువు మాత్రమే కనిపించే రాయలసీమలో ప్రకృతి ప్రసాదించిన అందాలివి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని చింతలచెరువు గ్రామ...
చాగలమర్రి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కరువు మాత్రమే కనిపించే రాయలసీమలో ప్రకృతి ప్రసాదించిన అందాలివి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని చింతలచెరువు గ్రామ సమీపంలోగల బైరవగుండాల జలాశయం పరిసరాల్లో నల్లమల అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుత వర్షాలకు జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయానికి ఎగువ కొండల నుంచి వర్షపు నీటితో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి కూడా వరద వస్తోంది. పచ్చని కొండలు, పచ్చదనంతో నిండిన పరిసరాలతో జలాశయం, టీజీపీ కాలువలో ప్రవహిస్తున్న నీరు మనోహరంగా కనిపిస్తోంది. ఈ ప్రకృతి అందాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి.