Bail Rejected: కాకాణి బెయిల్ తిరస్కరణ
ABN , Publish Date - Jun 21 , 2025 | 05:23 AM
క్వార్ట్ ్జఅక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నెల్లూరులోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి సరస్వతి బెయిల్‌ను తిరస్కరించారు.
నెల్లూరు(లీగల్), జూన్ 20(ఆంధ్రజ్యోతి): క్వార్ట్ ్జఅక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నెల్లూరులోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి సరస్వతి బెయిల్‌ను తిరస్కరించారు. గ్రావెల్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకాణి ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమం లోతనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.