Liquor Case: మద్యం కేసు.. బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:03 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు..
విజయవాడ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారానికి వాయిదా వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో కల్పించే సదుపాయాలపై జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా గురువారానికి వాయిదా వేశారు.