Share News

సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:13 AM

గుండెపోటు వచ్చిన రోగికి మొదటి కొన్ని నిమిషాల్లోనే సీపీఆర్‌ అందిం చడం ద్వారా జీవించే అవకాశాలు రెండింతల నుంచి మూడింతల వరకు ఉంటుందని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.సురేఖ అన్నారు.

 సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాలి
సీపీఆర్‌ చేసి చూపుతున్న వైద్యులు

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.సురేఖ

నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు వచ్చిన రోగికి మొదటి కొన్ని నిమిషాల్లోనే సీపీఆర్‌ అందిం చడం ద్వారా జీవించే అవకాశాలు రెండింతల నుంచి మూడింతల వరకు ఉంటుందని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.సురేఖ అన్నారు. మంగళవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జీజీహెచలో ఎమర్జెన్సీ మెడిసిన విభాగం ఆధ్వర్యంలో జాతీయ సీపీఆర్‌ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎ.సురేఖ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మదన మోహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ కార్డియో పల్మనరీ రెససికేషన (సీపీఆర్‌) అనేది గుండె ఆగిపోవడం లేదా శ్వాస ఆగిపోవడంవంటి అత్య వసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణకు అత్యంత కీలక మైన పద్ధతి అన్నారు. ప్రజలు సీపీ ఆర్‌పై అవగాహన పెం చుకొని నైపుణ్యాన్ని నేర్చుకుంటే మనిషి జీవితాన్ని కాపా డవచ్చన్నారు. ఈ వారో త్సవాల్లో హ్యాండ్‌ ఆన సీ పీఆర్‌ శిక్షణా కార్యక్ర మాలు, పోస్టర్‌ ప్రదర్శన లు, సీపీ ఆర్‌ అవగాహ న ర్యాలీలు నిర్వహిస్తా మన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మె డిసిన విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయకుమారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ ఎం. మహ మ్మద్‌ రఫీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇన చార్జీ హెచ ఓడీలు పాల్గొన్నారు. అనంతరం కళాశాల అధ్యా పకులు, విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది సీపీ ఆర్‌ అవగాహనను విస్తరించేందుకు ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - Oct 15 , 2025 | 12:13 AM