Share News

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా

ABN , Publish Date - May 18 , 2025 | 11:06 PM

కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.

   కార్యకర్తలకు అందుబాటులో ఉంటా
మినీ మహానాడులో మాట్లాడుతున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత సమావేశ భవనంలో ఆదివారం కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలం అని, రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే నిజమైన సైనికులు అన్నారు. అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ ఆశయాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన స్వీప్‌ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే జిల్లా మహానాడు, తర్వాత కడపలో జరిగే మహానాడును ధిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. కేడీసీసీబీ చైర్మనగా ఎంపికైన ఎదురూరు విష్ణువర్ధన రెడ్డి మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాననీ భరోసానిచ్చారు. రాబోయే 27వ తేదీన జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని కోరారు. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ మినీ మహానాడును కోడుమూరు నియోజకవర్గలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో సహకారం అందిస్తున్నారని వివరించారు. కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు రామలింగారెడ్డి, నాయకులు, కర్నూలు, గూడూరు, బెళగల్‌, కోడుమూరు మండలాల కార్యకర్తలు, సాధికార సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:06 PM