Share News

NTR Smart Township: అమ్ముడుపోని ప్లాట్లకు వేలం

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:15 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేందుకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది.

NTR Smart Township: అమ్ముడుపోని ప్లాట్లకు వేలం

  • స్మార్ట్‌ టౌన్‌షిప్పులకు కొత్త మార్గదర్శకాలు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేందుకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది. గతంలో అమ్ముడుపోని ప్లాట్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కొత్త దరఖాస్తులను నిలిపివేసి, అన్ని స్మార్ట్‌ టౌన్‌షిప్పుల్లో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి లాటరీ ద్వారా కేటాయింపులు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్‌హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం అనుమతి లెటర్లు, అగ్రిమెంట్‌ పొడిగింపులు చేపట్టాలని సూచించింది.

Updated Date - Aug 01 , 2025 | 05:18 AM