AP BJP State President: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు హేయం
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:32 AM
బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై జరుగుతోన్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ ఖండించాలి: మాధవ్
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై జరుగుతోన్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేని బంగ్లాదేశ్‌లో భారత్‌పై కుట్రపూరిత వ్యతిరేకత పెంచుతూ, హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, మూక హత్యలపై నిరసన వ్యక్తం చేయాలని ఒక ప్రకటనలో సూచించారు. దళిత హిందూ యువకుడు దీపూ చంద్రదాస్, తాజాగా రాజ్‌బరి జిల్లాలో మరో హిందూ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపడం తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే సినీనటులు ఖండిస్తున్నారని, అన్ని వర్గాలు నిరసనకు దిగితే ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెరిగి అక్కడి మైనార్టీ హిందువుల ప్రాణాలు పోకుండా ఆగుతాయన్నారు.