Manda krishna Madiga: చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరికం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:16 AM
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయిపై దాడి అనాగరికమని, దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
మందకృష్ణ మాదిగ
గుంటూరులో ఎమ్మార్పీఎస్ నిరసన ర్యాలీ
గుంటూరు(తూర్పు), అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయిపై దాడి అనాగరికమని, దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . దాడిని నిరసిస్తూ సోమవారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అం దించారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సీజేను అవమానించిన నిందితులను అరెస్ట్ చేయకపోతే దేశంలో సామాన్య దళిత ప్రజలకు రక్షణ, గౌరవం ఎక్కడ ఉంటుందన్నారు. దాడిని ఖండిస్తూ ప్రధాని స్పందించిన తీరును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 22న చలో హైదరాబాద్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో , 23న చలో అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో, 24న చెన్నైలో, 25న బెంగళూరులో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వివరించారు.