Nandyal District: ఆత్మకూరు కుర్రోడికి రూ.52 లక్షల ప్యాకేజీ
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:53 AM
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రామాలయం వీధికి చెందిన పురోహితుడు గరుడాద్రి వెంకటేశ్వర శర్మ, శ్రీవాణి దంపతుల కుమారుడు మైత్రేయశర్మ రూ.52 లక్షల ప్యాకేజీతో ఐటీ ఉద్యోగం సాధించి ఔరా అనిపించాడు.
ఆత్మకూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రామాలయం వీధికి చెందిన పురోహితుడు గరుడాద్రి వెంకటేశ్వర శర్మ, శ్రీవాణి దంపతుల కుమారుడు మైత్రేయశర్మ రూ.52 లక్షల ప్యాకేజీతో ఐటీ ఉద్యోగం సాధించి ఔరా అనిపించాడు. శర్మ 1 నుంచి 5వ తరగతి వరకు ఆత్మకూరులోని శ్రీసత్యవాణి విద్యా మందిరంలో, 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ విద్యా విహార్‌లో విద్యనభ్యసించాడు. తర్వాత విజయవాడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీలో 933 మార్కులతో రాణించాడు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్(ఈసీఈ) పూర్తి చేశాడు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ద్వారా కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్(వైర్‌లెస్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్) సీటు సాధించాడు. కోర్సు ఇంకా ఆరు నెలలు మిగిలి ఉండగానే క్వాంటమ్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ.52 లక్షల వార్షిక ప్యాకేజీతో మైత్రేయ శర్మను ఉద్యోగిగా ఎంపిక చేసుకుంది.