Share News

state president PVN Madhav: నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:31 AM

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన సుపరిపాలన యాత్రకు విశేష స్పందన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు...

state president PVN Madhav: నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

  • అమరావతిలో 2.53 ఎకరాల్లో అటల్‌ స్మృతివనం: మాధవ్‌

అమరావతి, తుళ్లూరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన సుపరిపాలన యాత్రకు విశేష స్పందన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాగోతు రమేశ్‌, వల్లూరు జయప్రకాశ్‌, షేక్‌ బాజీ, లక్ష్మీ ప్రసన్న తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వాజపేయి అనేక రంగాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు. భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూడాలన్నదే ఆయన ఆశయం. ఆ లక్ష్యం ప్రధాని మోదీ ద్వారా 2047కు నెరవేరబోతోంది. ఈ నెల 11న ధర్మవరం నుంచి ప్రారంభమైన సుపరిపాలన యాత్ర 25న వాజపేయి జయంతి సందర్భంగా ముగుస్తుంది. అమరావతిలో అటల్‌ స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 13 అడుగుల వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - Dec 25 , 2025 | 04:32 AM