APPSC: సహాయ పర్యావరణ ఇంజనీర్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:04 AM
కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది.
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 21 మందిని ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సంస్థ కార్యదర్శి పి.రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. నియామక అధికారి వద్ద ఎంపికైన అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపించాలన్నారు. ఈ ఎంపిక న్యాయస్థానంలో ఉన్న కేసుల తుది ఆదేశాలకు లోబడి ఉంటుందన్నారు.