AP Assembly Sessions: 18 నుంచి అసెంబ్లీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:10 AM
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చారు.
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనమండలి, 10 గంటలకు శాసనసభ సమావేశమవుతాయి. మొదటి రోజు సమావేశం అనంతరం రెండు సభల బీఏసీ సమావేశాలు జరుగుతాయి. బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.