Share News

Speaker Ayyannapatrudu: వచ్చే నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:53 AM

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 17 లేదా 18 నుంచి నిర్వహించనున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపా..

Speaker Ayyannapatrudu: వచ్చే నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

  • అన్ని పార్టీలూ హాజరైతే ప్రజాసమస్యలపై ఆరోగ్యకర చర్చ: అయ్యన్న

  • శాసనసభలో కొత్త ముద్రణ యంత్రాలను ప్రారంభించిన స్పీకర్‌

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 17 లేదా 18 నుంచి నిర్వహించనున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం శాసనసభ ప్రాంగణంలో అత్యాధునిక ప్రింటింగ్‌ యంత్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాల సమావేశాలను 10 రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల సభ్యులు హాజరైతే ప్రజాసమస్యలపై ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కొత్త ప్రింటింగ్‌ యంత్రాలు అత్యంత వేగవంతమైనవే కాకుండా, అత్యుత్తమ ప్రింట్‌ నాణ్యతను అందిస్తాయని చెప్పారు. శిక్షణ పొందిన సిబ్బందితోపాటు కొత్తగా చేరిన సిబ్బంది కూడా ఈ యంత్రాలను సులభంగా నిర్వహించగలరన్నారు. ప్రింటింగ్‌తోపాటు ఆటోమేటిక్‌ స్పైరల్‌ బైండింగ్‌ సదుపాయం కూడా వీటిలో ఉందని చెప్పారు. శాసనసభకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, ప్రకటనలు, కార్యాచరణ నివేదికలు తదితరాలను వీటి ద్వారా అత్యంత వేగంగా ముద్రించవచ్చన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 04:53 AM