State Legislative Secretary General: సహకార సంస్థల్లో అక్రమాలపై రేపు సభా సంఘం ఫిర్యాదుల స్వీకరణ
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:22 AM
ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్.అమరనాథ్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన...
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్.అమరనాథ్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన ప్రత్యేక సభా సంఘానికి ఈ నెల 18వ తేదీన వినతులు, ఫిర్యాదులు సమర్పించవచ్చని రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెలగపూడిలోని శాసన సభ భవన సముదాయంలో ఆరోజు సభా సంఘానికి లిఖితపూర్వకంగా వినతులు, ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. లేదా ‘సహాయ కార్యదర్శి, శాసన వ్యవస్థ, సచివాలయం, శాసనసభ భవన సముదాయం, వెలగపూడి, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ 522238’ అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపవచ్చని. ఫోన్ నంబరు 91-863-2449177 ద్వారా కానీ, ఈ-మెయిల్ ఐడీ ్చఞజూ.్చఞఛిౌఛఃజఝ్చజీజూ.ఛిౌఝ ద్వారా కూడా ఫిర్యాదులు, వినతులను పంపవచ్చని సూచించారు.