Minister Narayana: 5 మున్సిపల్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:29 AM
మున్సిపల్ శాఖకు సంబంధించి ఐదు సవరణ బిల్లులను మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ శాఖకు సంబంధించి ఐదు సవరణ బిల్లులను మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నాలా చట్టం రద్దుతో పాటు మున్సిపాలిటీల్లో అభివృద్ధి చార్జీలను విధించే బిల్లులను సభ ఆమోదించింది. అలానే అర్బన్ ప్రాంతాల్లో బిల్డింగ్ రెగ్యురైజేషన్ స్కీమ్‌కు సంబంధించి భవనాల ఎత్తును 18 మీటర్ల నుంచి 24 మీటర్లు పెంచే బిల్లుకు, వైఎ్‌సఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేసే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులపై ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, భవనాల రెగ్యులరైజ్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించడం మంచి నిర్ణయమన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపాలిటీల ఎక్స్‌టర్నల్ అభివృద్ధి చార్జీలను తిరిగి స్థానిక సంస్థలకే ఇవ్వడం గొప్ప నిర్ణయమన్నారు.