Share News

Chittoor: ఇంటర్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 04:04 AM

జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇంటర్‌ విదార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు ఒంటరిగా ఉన్న జంటను బెదిరించి..

Chittoor: ఇంటర్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

  • ‘చిత్తూరు’ అటవీశాఖ పార్కులో ఒంటరి జంటను బెదిరించి ఘాతుకం

చిత్తూరు అర్బన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇంటర్‌ విదార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు ఒంటరిగా ఉన్న జంటను బెదిరించి, అందులో యువతిని చెరబట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలివీ.. పూతలపట్టు మండలానికి చెందిన బాలిక చిత్తూరులో ఇంటర్మీడియట్‌ చదువుకుంటోంది. గత గురువారం స్నేహితుడితో కలిసి మురకంబట్టు సమీపంలో అటవీశాఖకు చెందిన ‘నీవా నగర వనం’ పార్కుకు వెళ్లింది. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు స్నేహితులు హేమంత్‌, మహేష్‌, కిశోర్‌ ఆ ప్రేమజంటను చూసి టార్గెట్‌ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫొటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా సోమవారం పార్కు వద్ద ఆ ముగ్గురిలో ఇద్దరికి దేహశుద్ధి చేసి చిత్తూరు తాలుకా పోలీసులకు అప్పగించారు. మరొకడు పరారయ్యాడు. హత్యాయత్నం, పోక్సో, గ్యాంగ్‌ రేప్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 01 , 2025 | 04:05 AM