Share News

తెలుగువారి గౌరవం ఇనుమడింపజేస్తా: గజపతిరాజు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:33 AM

రాజకీయాల్లో తానెప్పుడూ అవకాశాల కోసం పరుగెత్తలేదని.. ఇస్తే మాత్రం న్యాయం చేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

తెలుగువారి గౌరవం ఇనుమడింపజేస్తా: గజపతిరాజు

  • అవకాశాల కోసం పరుగెత్తలేదు..ఇస్తే న్యాయం చేస్తున్నా:అశోక్‌ గజపతిరాజు

  • మోదీ, చంద్రబాబుకు మాజీ మంత్రి ధన్యవాదాలు

విజయనగరం రూరల్‌,జూలై 14(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో తానెప్పుడూ అవకాశాల కోసం పరుగెత్తలేదని.. ఇస్తే మాత్రం న్యాయం చేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. తనను గోవా గవర్నర్‌గా నియమించడంపై సోమవారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.తెలుగువారి గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసేలా గవర్నర్‌ బాధ్యతలు నిర్వహిస్తానన్నారు.బంగళా తనకు అలవాటైనదేనని..కొత్త అసైన్‌మెంట్‌ వచ్చినప్పుడు అక్కడకు వెళ్లడం.. పూర్తయిన తర్వాత తిరిగి బంగళాకు రావడం జరుగుతున్నదేనని తెలిపారు. తనను గవర్నర్‌గా నియమించిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయనకు విజయనగరం పైడిమాంబ దేవస్థానం పురోహితులు ఆశీర్వచనం అందించారు.

అశోక్‌ నియామకంపై గోవా సీఎం హర్షం

అశోక్‌ నియామకంపై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ హర్షం వ్యక్తంచేశారు.‘ఆయన అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు.‘వికసిత్‌ గోవా-2037’దిశగా ఆయన పార్లమెంటరీ అనుభవం,మార్గదర్శకత్వం ఉపకరిస్తాయని విశ్వసిస్తున్నాను’ అని పేర్కొన్నారు.అశోక్‌ నియామకంపై టీడీపీ నేత కంభంపాటి రామమోహన్‌రావు కూడా హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 15 , 2025 | 03:35 AM