ఇష్టానుసారం!
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:28 AM
- విజయవాడను ఆనుకుని బందరు కాల్వపై ఉన్న ఓ లాక్ వద్ద సూపరింటెండెంట్ గడచిన 18 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. అతనికి ఐదేళ్ల సర్వీసు గడువు తీరిపోయింది. ఇటీవల జరిగిన బదిలీల్లో అధికారులు ఆయనను బదిలీ చేయడానికి సాహసించలేదు. ముందు బదిలీల జాబితాలో ఆయన పేరు చేర్చినప్పటికీ కొన్ని రోజులకు దానిని తొలగించారు. -కేసీ డివిజన్‌లో ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్‌కు ఇక్కడ ఐదేళ్ల సర్వీసు పూర్తయింది. తనను బదిలీ చేయవద్దంటూ బదిలీల సీజన్ ఆరంభమైన ప్రతిసారి ఆమె అధికారులకు దరఖాస్తు చేసుకుంటుంది. తనకు పీహెచ్‌సీ కోటా వర్తిస్తుంది కాబట్టి బదిలీ వర్తించదని చెబుతుంది. దీని ప్రకారం ఆమెను పొరుగు మండలాలకు బదిలీ చేయకపోయినా విజయవాడలోనే డివిజన్ మార్చవచ్చు. అధికారులు ఆ పని చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆమెకు అదే డివిజన్‌లో సీటు కేటాయిస్తున్నారు. -స్పెషల్ డివిజన్‌లో ఉన్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్నారు. బదిలీల నిబంధనల ప్రకారం సంఘం నాయకులు ప్రధాన కేంద్రాల్లో మూడు సార్లు పనిచేయవచ్చు. అంటే ఐదేళ్ల చొప్పున మూడు సార్లు పనిచేసుకునే అవకాశం ఉంది. ఆ నాయకుడికి ఈ ‘మూడు’ ముగిసిపోయాయి. అయినా ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన స్థానం కదల్లేదు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న స్థానంలోనే కొనసాగుతున్నారు. కేసీ డివిజన్‌లో మరో సీనియర్ అసిస్టెంట్‌ది ఇదే పరిస్థితి. ఇవన్నీ జలవనరుల శాఖలో జరిగిన బదిలీల్లోని లీలలు. దీనిపై ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఇరిగేషన్’ బదిలీల్లో నిబంధనలకు తిలోదకాలు
ఐదేళ్ల సర్వీసు పూర్తయినా వదలని సీట్లు
స్థానాలను పదిలం చేసుకున్న సంఘ నాయకులు
సాధారణ ఉద్యోగులకు తప్పని బదిలీల పోటు
అధికారుల తీరుపై విమర్శలు వెల్లువ
- విజయవాడను ఆనుకుని బందరు కాల్వపై ఉన్న ఓ లాక్ వద్ద సూపరింటెండెంట్ గడచిన 18 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. అతనికి ఐదేళ్ల సర్వీసు గడువు తీరిపోయింది. ఇటీవల జరిగిన బదిలీల్లో అధికారులు ఆయనను బదిలీ చేయడానికి సాహసించలేదు. ముందు బదిలీల జాబితాలో ఆయన పేరు చేర్చినప్పటికీ కొన్ని రోజులకు దానిని తొలగించారు.
-కేసీ డివిజన్‌లో ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్‌కు ఇక్కడ ఐదేళ్ల సర్వీసు పూర్తయింది. తనను బదిలీ చేయవద్దంటూ బదిలీల సీజన్ ఆరంభమైన ప్రతిసారి ఆమె అధికారులకు దరఖాస్తు చేసుకుంటుంది. తనకు పీహెచ్‌సీ కోటా వర్తిస్తుంది కాబట్టి బదిలీ వర్తించదని చెబుతుంది. దీని ప్రకారం ఆమెను పొరుగు మండలాలకు బదిలీ చేయకపోయినా విజయవాడలోనే డివిజన్ మార్చవచ్చు. అధికారులు ఆ పని చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ఆమెకు అదే డివిజన్‌లో సీటు కేటాయిస్తున్నారు.
-స్పెషల్ డివిజన్‌లో ఉన్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్నారు. బదిలీల నిబంధనల ప్రకారం సంఘం నాయకులు ప్రధాన కేంద్రాల్లో మూడు సార్లు పనిచేయవచ్చు. అంటే ఐదేళ్ల చొప్పున మూడు సార్లు పనిచేసుకునే అవకాశం ఉంది. ఆ నాయకుడికి ఈ ‘మూడు’ ముగిసిపోయాయి. అయినా ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన స్థానం కదల్లేదు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న స్థానంలోనే కొనసాగుతున్నారు. కేసీ డివిజన్‌లో మరో సీనియర్ అసిస్టెంట్‌ది ఇదే పరిస్థితి.
ఇవన్నీ జలవనరుల శాఖలో జరిగిన బదిలీల్లోని లీలలు. దీనిపై ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
విజయవాడ కేంద్రంగా వివిధ డివిజన్లలో పనిచేస్తున్న కొంతమంది పలుకుబడిని అధికారులపై ఉపయోగించారు. రాజకీయ సిఫార్సులతో కొంతమంది, ఉద్యోగ సంఘాల్లో ఉన్న పదవులను అడ్డంపెట్టుకుని బది‘లీలలు’ నడిపారు. పారదర్శకంగా బదిలీల ప్రక్రియను నిర్వహించాల్సిన అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల నుంచి ఉమ్మడి జిల్లాలోని ఇతర డివిజన్లకు విసిరేశారు. ఐదేళ్ల సర్వీసు నిండిపోయి ఏళ్లు గడుస్తున్న వారిని మాత్రం ప్రధాన కేంద్రం నుంచి కదపకుండా, ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
అత్యంత రహస్యంగా..
బదిలీ ప్రక్రియను మూడో కంటికి తెలియకుండా అత్యంత రహస్యంగా జలవనరుల శాఖ అధికారులు నిర్వహించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని ప్రధాన కేంద్రం విజయవాడలో కొనసాగించడానికి, కొంతమందిని సమీప ప్రాంతాల్లో నియమించుకోవడానికి ఈ విధంగా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది బదిలీ వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్టు జలవనరుల శాఖ ప్రాంగణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద లాక్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేశామని చెప్పుకోవడానికి బ్యారేజ్‌కు అవతలి వైపున ఉన్న సీతానగరం లాక్‌కు మార్చారు. అక్కడున్న సూపరింటెండెంట్‌ను ప్రకాశం బ్యారేజ్ సెక్షన్‌కు తీసుకొచ్చారు. బందరు సెక్షన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఆయనకు బందరు సెక్షన్‌లో ఐదేళ్ల సర్వీసు పూర్తికాలేదు. తిరిగి జలవనరుల శాఖకు వచ్చిన ఆయన దరఖాస్తు చేయకుండానే బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ఆయనను బందరు సెక్షన్‌లో నియమించాలి. అటువంటిది ఆయనను కేసీ డివిజన్‌కు బదిలీ చేశారు. కేసీ డివిజన్ పరిధిలో పనిచేసే ఓ ఉద్యోగి కొద్దినెలల క్రితం అధికారులు, సిబ్బంది వేధింపుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనను వేధించిన అధికారులు, సిబ్బందికి ఐదేళ్లు దాటినా బదిలీ కాలేదు. ముఖ్యంగా ఒక మహిళా సీనియర్ అసిస్టెంట్ మాత్రం తాను కేసీ డివిజన్‌లో తప్ప ఇంకెక్కడ పని చేయనని చెబుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఇటీవల జరిగిన బదిలీలల్లో జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలేశారు. ఐదేళ్ల సర్వీసు పూర్తికాకుండా బదిలీ చేసిన ఉద్యోగులు దీనిపై భగ్గుమంటున్నారు.