ఆర్యవైశ్యుల చిరకాల కోరిక నెరవేర్చారు: డూండీ
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:18 AM
ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయిన పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చడంపై కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయిన పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చడంపై కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవడం ఆర్యవైశ్య సమాజానికి అపార గౌరవాన్ని చేకూర్చిందని రాకేశ్ అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.