Share News

Senior Advocate Peteti Rajarao: అరుణ నన్ను బెదిరించింది

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:27 AM

వంద లీటర్ల పెట్రోలు పోసి నీ కార్యాలయాన్ని తగులబెట్టి, నీ కుటుంబసభ్యులందరినీ చంపేస్తా. అని కిలేడీ నిడుగుంట అరుణ తీవ్రస్థాయిలో బెదిరించినట్టు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు.

Senior Advocate Peteti Rajarao: అరుణ నన్ను బెదిరించింది

  • నా ఆఫీసును తగలబెట్టిస్తానని, కుటుంబాన్ని చంపేస్తానంది

  • కి‘లేడీ’పై హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు

నెల్లూరు క్రైం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘వంద లీటర్ల పెట్రోలు పోసి నీ కార్యాలయాన్ని తగులబెట్టి, నీ కుటుంబసభ్యులందరినీ చంపేస్తా.’’ అని కిలేడీ నిడుగుంట అరుణ తీవ్రస్థాయిలో బెదిరించినట్టు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడుకి చెందిన ఆయన సోమవారం నెల్లూరులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపడుగుపాడులోని ఓ అపార్ట్‌మెంట్‌లో తాను కుటుంబంతో సహా నివాసం ఉంటున్నానని తెలిపారు. అదే అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఓ ఫ్లాట్‌ను సంవత్సరం క్రితం అరుణ అద్దెకు తీసుకున్నట్టు చెప్పారు. అరుణ తన ఫ్లాట్‌కు గుర్తుతెలియని వ్యక్తులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలు చేయిండచాన్ని గుర్తించి ఆమెను ప్రశ్నించానన్నారు. దీంతో ఆమె తన అనుచరులతో వచ్చి ‘‘ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. పెట్రోల్‌ పోసి నీ ఆఫీసును తగులబెట్టిస్తా.’’ అని బెదిరించినట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా తన కారు స్పేర్‌పార్ట్స్‌ తీసేయడం, బైక్‌లో పెట్రోలు తీసేయడం వంటి పనులను చేసినట్టు పేర్కొన్నారు. అరుణ అగడాలను బయట పెట్టాలని రాజారావు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిని సైతం ధ్వంసం చేయించినట్టు తెలిపారు. చివరకు తనపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించినట్టు పేర్కొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 05:28 AM