Share News

AP Deputy Pawan Kalyan: సమాజానికి కళలు చాలా అవసరం

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:38 AM

సమాజంలో కళలు(ఫైన్‌ ఆర్ట్స్‌) లేకపోతే మనుషుల్లో హింసా ప్రవృతి పెరిగిపోతుందని, సమాజం విచ్ఛిన్నం అవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు.

 AP Deputy Pawan Kalyan: సమాజానికి కళలు చాలా అవసరం

  • లేకపోతే మనుషుల్లో హింస పెరుగుతుంది: పవన్‌

  • ఢిల్లీలో ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ సందర్శన

  • ఏపీలో ఎన్‌ఎ్‌సడీ క్యాంపస్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సమాజంలో కళలు(ఫైన్‌ ఆర్ట్స్‌) లేకపోతే మనుషుల్లో హింసా ప్రవృతి పెరిగిపోతుందని, సమాజం విచ్ఛిన్నం అవుతుందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి కళలు కచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. అనంతరం నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఎన్‌ఎ్‌సడీ)ను సందర్శించారు. స్కూల్‌ డైరెక్టర్‌ చిత్తరంజన్‌ త్రిపాఠితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కూల్‌ పరిధిలోని బుక్‌స్టాల్‌ను సందర్శించి రూ.36 వేల విలువైన 77 పుస్తకాలను పవన్‌ కొనుగోలు చేశారు. అనంతరం ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థు లు ప్రదర్శించిన నాటకాన్ని వీక్షించారు. విద్యార్థుల నటన కౌశలానికి మంత్రముగ్థులైన పవన్‌.. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మీడియా తో పవన్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్‌ఎ్‌సడీ క్యాంపస్‌ ఏర్పాటుకు కృషి చేస్తాన ని, దీనికి అవసరమైన భూమి గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలుగు సినీపరిశ్రమ ప్రపంచస్థాయికి చేరిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సహకారం అందిస్తున్నట్లే, తెలుగు సినీపరిశ్రమకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడానికి వారికి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమోనని ఎద్దేవా చేశారు. వారు ఏ రాజ్యాంగం ఉన్నా.. భారత రాజ్యాంగాన్ని పాటించే తమ కూటమి ప్రభుత్వంలో అది చెల్లదని అన్నారు. కాగా, నేపాల్‌కు చెందిన ఎన్‌ఎ్‌సడీ విద్యార్థి ఒకరు పవన్‌కు తమ జాతీయ జెండా బ్యాడ్జిని ధరింపచేశారు.

Updated Date - Sep 13 , 2025 | 06:39 AM