Excise Police: నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి పీఏ అరెస్టు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:46 AM
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్(ఏ5)ను...
ములకలచెరువు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్(ఏ5)ను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయవాడ హైకోర్టు లాయర్‌ను కలసి ఓ బస్సులో వస్తు న్న రాజేశ్‌ను ఎక్సైజ్ పోలీసులు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద పట్టుకున్నారు. అతడిని వెంట తీసుకెళ్లి ఈ కేసులో మరో నిందితుడైన జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే బాబు అలియాస్ అన్బురాసు(ఏ 19)ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. తంబళ్లపల్లె కోర్టులో రాజేశ్‌ను హాజరు పరిచారు. జడ్జి ఉమర్ ఫరూక్ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో రాజేశ్‌ను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.