Share News

Parliament: పార్లమెంట్‌లో అరకు కాఫీ

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:13 AM

పార్లమెంట్‌ ఆవరణలో అరకు కాఫీ షాపు కొలువు దీరనుంది. మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు,

Parliament: పార్లమెంట్‌లో అరకు కాఫీ

పార్లమెంటులో మన గళం..

లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వినతి

న్యూఢిల్లీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఆవరణలో అరకు కాఫీ షాపు కొలువు దీరనుంది. మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ సీఎం రమేశ్‌ కలిశారు. అరకు కాఫీ ప్రాముఖ్యతను, పలు సందర్భాల్లో ప్రధాని కీర్తించిన విషయాలను స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం రామ్మోహన్‌ నాయుడు ‘అరకు కాఫీని ప్రోత్సహించాలని లోకసభ స్పీకర్‌ ఓం బిర్లాని కోరాం.


పార్లమెంటులో అరకు కాఫీ ప్రచారం కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, శాశ్వతంగా ఒక స్టాల్‌ ఏర్పాటు చేయాలని కోరాం. స్పీకర్‌ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే కాఫీ షాపు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు’ అని ఎక్స్‌లో వెల్లడించారు.

Updated Date - Mar 12 , 2025 | 06:14 AM