APTS Chairman: ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:37 AM
గూగుల్ ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌లు ఏపీని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెడతాయని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ అన్నారు.
ప్రవాసాంధ్రులతో ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ
(న్యూజెర్సీ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
గూగుల్ ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌లు ఏపీని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెడతాయని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ అన్నారు. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడానికి, రాష్ర్టాభివృద్ధికి ప్రవాసాంధ్రులు విరివిగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అమెరికాలోని న్యూజెర్సీలో ‘మీట్ విత్ మోహనకృష్ణ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ల సమన్వయం రాష్ర్టానికి కొత్త దిశను చూపిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇన్నోవేషన్ కేంద్రంగా రాష్ట్రం దూసుకెళ్తోందని పేర్కొన్నారు. కూటమి గెలుపునకు కృషి చేసిన ప్రవాసాంధ్రులు, రాష్ర్టాభివృద్ధిలో కూడా కీలకమని, పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, ఎన్నారై టీడీపీ శ్రేణులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.