APPSC: 691 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:41 AM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీ వచ్చినా ఏపీపీఎస్సీ ద్వారా ఇదే తొలి నోటిఫికేషన్.
256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు
కూటమి ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్
కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీ వచ్చినా ఏపీపీఎస్సీ ద్వారా ఇదే తొలి నోటిఫికేషన్. అటవీ శాఖలో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజాబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పోర్ట్స్ కోటా ఖాళీలు, ఎస్సీ గ్రూపుల వారీగా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్
కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలను రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 693 మంది లెక్చరర్ల సేవలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 11 నెలలపాటు ఈ కాంట్రాక్టు కొనసాగుతుంది.