Share News

APPSC Recruitment: 21 పోస్టులతో 5 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

ABN , Publish Date - Sep 17 , 2025 | 03:41 AM

వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం ఐదు నోటిఫికేషన్లు జారీచేసింది. రెండు జూనియర్‌ లెక్చరర్‌...

APPSC Recruitment: 21 పోస్టులతో 5 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం ఐదు నోటిఫికేషన్లు జారీచేసింది. రెండు జూనియర్‌ లెక్చరర్‌, ఒక బీసీ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అటవీ శాఖలో 13 డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 టెక్నికల్‌ అసిస్టెంట్‌, గ్రామీణ తాగునీటి విభాగంలో మూడు ఏఈఈ, ఉద్యాన శాఖలో రెండు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేసింది. ఇందులో మొదటి రెండు నోటిఫికేషన్లకు అక్టోబరు 7 వరకు, మిగిలిన మూడు నోటిఫికేషన్లకు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.

Updated Date - Sep 17 , 2025 | 03:41 AM