AP BC Welfare Department: కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌కు డైరెక్టర్ల నియామకం
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:10 AM
ఏపీ కుమ్మరి, శాలివాహన సంక్షేమ కార్పొరేషన్‌కు 15 మంది అనధికార డైరెక్టర్లను నియమిస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ కుమ్మరి, శాలివాహన సంక్షేమ కార్పొరేషన్‌కు 15 మంది అనధికార డైరెక్టర్లను నియమిస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా ఇప్పటికే పెరెపి ఈశ్వర్‌ను నియమించారు. పండూరి అప్పారావు(రాజమండ్రి రూరల్), భీమా బత్తుల సత్యనారాయణ(కాకినాడ రూరల్), డాలిపర్తి వేమన్న (రాజమండ్రి రూరల్), కె.నాగేంద్ర(అనంతపురం అర్బన్), కె.వెంకటసుబ్బయ్య (తాడిపర్తి), కొడేటి లక్ష్మి కనకదుర్గ(అచంట), లక్ష్మి భీమవరపు(ఉంగుటూరు), మేడపాకుల శ్రీనివాసరావు(దర్శి), పీబీవీ సుబ్బయ్య (కర్నూల్), పి.భావన(మదనపల్లి), పిడతల నేమిలయ్య(దర్శి), జీడిమళ్ల సత్యవతి(తిరువూరు), కమ్మరి సుధాకర్(డోన్), గుడి స్వర్ణ(రాయచోటి), మాచవరపు విజయకుమారి(మండపేట)లను డైరెక్టర్లుగా నియమించారు. వీరు రెండేళ్లు పదవిలో ఉంటారు.