BC Welfare Department: మరో రెండు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో మరో రెండు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా రెడ్డి అనంతకుమారిని ఇప్పటికే ప్రభుత్వం నియమించింది. తాజాగా దేవళ్ల వెంకట్రాముడు(ఎమ్మిగనూరు), జి.అమర్నాథ్ (పుంగనూరు), గుబ్బళ్ల ఫణికుమార్(రాజోలు), అంగార రంగనాథ్(పెడన), దాసరి తాతారావు(పలాస)లను డైరెక్టర్లుగా నియమించింది. కాగా, బెస్త సంక్షేమ కార్పొరేషన్‌గా చైర్మన్‌గా సూళ్లూరుపేటకు చెందిన బొమ్మన సుధీర్‌ను నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెస్త పవన్‌కుమార్(అనంతపురం అర్బన్), బెస్త శ్రీనివాసులు(ధర్మవరం), బెస్త మల్లికార్జున(డోన్), బెస్త మనోహర్(శ్రీసత్యసాయి), చంద్రశేఖర్(రాయచోటి), భాస్కర్‌రావు(కర్నూలు), కొడిపర్తి శ్రీధర్(గూడూరు), మల్లె వెంకటసుబ్బయ్య(కమలాపురం), పి.అమరావతి(పూతలపట్టు), పి.తిరుమగల్(కుప్పం), బొమ్మని పలాని(సూళ్లూరుపేట), వేటగిరి రాంప్రసాద్(కడప), బెస్త రామాంజనేయులు(ఆదోని), చాప సోమయ్య( బాపట్ల), టీజీ రమేశ్ బాబు(కర్నూలు)లను డైరెక్టర్లుగా నియమించింది.