Share News

సహకార సంఘం సొసైటీల ఛైర్మనల నియామకం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:27 AM

నియోజకవర్గంలోని వ్యవసాయ సహకార సంఘం సొసైటీలకు త్రిసభ్య కమిటీ నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

సహకార సంఘం సొసైటీల ఛైర్మనల నియామకం

నందికొట్కూరు సహకార సంఘం

సొసైటీ ఛైర్మనగా ముర్తుజావలి

నందికొట్కూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని వ్యవసాయ సహకార సంఘం సొసైటీలకు త్రిసభ్య కమిటీ నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 468 సొసైటీలకు ఛైర్మనతో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రటరీ కార్యాలయం నుంచి జీవో విడుదలైంది. అందులో నందికొట్కూరు నియోజకవర్గంలో 5 సహకార సంఘం సొసైటీలకు త్రీమెన కమిటీలను నియమించారు.

ఫ నందికొట్కూరు సహకార సంఘం సొసైటీ చైర్మనగా ఎస్‌. ముర్తుజావలి, సభ్యులుగా కె.మద్దిలేటి, బి. నారాయణ ఎన్నికయ్యారు.

ఫ పగిడ్యాల సహకార సంఘం సొసైటీ చైర్మనగా దామోదర్‌ రెడ్డి, సభ్యులుగా తెలుగు పల్లె గంగన్న, కె. శంకర్‌లను నియమించారు.

ఫ మిడ్తూరు మండలంలోని పీర్‌సాహెబ్‌ పేట సహకార సంఘం సొసైటీ ఛైర్మనగా ఆర్‌.వెంకటేశ్వరరెడ్డి, సభ్యులుగా ధనుంజయరెడ్డి, డి. అబ్దుల్లాలు నియమితులయ్యారు.

ఫ పాములపాడు మండలంలోని మద్దూరు సహకార సంఘం సొసైటీ ఛైర్మన కమ్మిరెడ్డి జనార్ధనరెడ్డి, సభ్యులు బసిరెడ్డి అరుణమ్మ, పి.వీరకృష్ణుడులు నియమితులయ్యారు.

ఫ కొత్తపల్లి మండలం నాగంపల్లి సహకార సంఘం సొసైటీ ఛైర్మనగా బి.నాగేశ్వరరావు, సభ్యులుగా కె.రాధాకృష్ణారెడ్డి, జె.హుసేనయ్యలు నియమితులయ్యారు.

Updated Date - Jul 10 , 2025 | 12:27 AM