Share News

PGCET 2025 Alert: ఉమ్మడి పీజీ సెట్‌ దరఖాస్తులకు ఆహ్వానం

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:44 AM

ఏపీ లోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 5వ తేదీ వరకు అప్లికేషన్ గడువు ఉంది

PGCET 2025 Alert: ఉమ్మడి పీజీ సెట్‌ దరఖాస్తులకు ఆహ్వానం

  • మే 5వ తేదీ వరకు గడువు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్వీయూ వీసీ సీహెచ్‌ అప్పారావు, పీజీసెట్‌-2025 కన్వీనర్‌ పీసీ వేంకటేశ్వర్లు, కో-కన్వీనర్‌ కె.సురేంద్రబాబు తెలిపారు. తిరుపతిలో గురువా రం వారు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల్లో పీజీలో ప్రవేశానికి చేపట్టే ఉమ్మడి పీజీసెట్‌-2025 నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించిందన్నారు. గత నెల 31న నోటిఫికేషన్‌ విడుదల చేశామని, ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దరఖాస్తుకు మే 5వ తేదీ చివరి గడువుగా నిర్ణయించామన్నారు. ఓసీ రూ.850, బీసీ రూ.750, ఎస్సీ, ఎస్టీలకు రూ.650 దరఖాస్తు రుసుం నిర్ణయించామని తెలిపారు. అపరాధ రుసుంతో మే 25వ తేదీ దాకా దరఖాస్తు గడువు ఉంటుందని వెల్లడించారు. జూన్‌ 9 నుంచి 13వ తేదీ దాకా.. ప్రతి రోజూ మూడు సెషన్స్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:44 AM